ప్రజలు భౌతికదూరం పాటించాలి: మంత్రి పువ్వాడ
దిశ, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ మోతీనగర్‌లో రవాణా శాఖ మంత్రి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. మోతీనగర్‌లో ఒక పాజిటివ్ కేసు నమోదుకావడంతో అక్కడి పరిస్థితులను కలెక్టర్ కర్ణన్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించడమే కరోనా మహమ్మారిని నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, తహసీల్దార్ శ్రీనివాసరావు , అధికారులు, కార్పొరేటర్లు […]
దిశ, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ మోతీనగర్‌లో రవాణా శాఖ మంత్రి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. మోతీనగర్‌లో ఒక పాజిటివ్ కేసు నమోదుకావడంతో అక్కడి పరిస్థితులను కలెక్టర్ కర్ణన్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించడమే కరోనా మహమ్మారిని నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, తహసీల్దార్ శ్రీనివాసరావు , అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
tag: Puvvada ajay, comments, physical distance, corona Prevention, khammam