BJP ఎంపీలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కమలం పార్టీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. రాష్రంలోని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల్లో అధిక వాటా కేంద్రం నుంచే వచ్చిందని బీజేపీ లీడర్లు, కాదని గులాబీ లీడర్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తాజాగా రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ నేతలు పెన్షన్‌పై చేసిన కామెంట్లపై ఫైర్ అయ్యారు. పెన్షన్ డబ్బుల్లో కేంద్రం వాటా రూ.200 మాత్రమేనని, అంతకంటే ఒక్కరూపాయి ఎక్కువ వచ్చినా […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కమలం పార్టీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. రాష్రంలోని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల్లో అధిక వాటా కేంద్రం నుంచే వచ్చిందని బీజేపీ లీడర్లు, కాదని గులాబీ లీడర్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తాజాగా రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ నేతలు పెన్షన్‌పై చేసిన కామెంట్లపై ఫైర్ అయ్యారు.
పెన్షన్ డబ్బుల్లో కేంద్రం వాటా రూ.200 మాత్రమేనని, అంతకంటే ఒక్కరూపాయి ఎక్కువ వచ్చినా తాను రాజీనామా చేస్తానని.. లేనియెడల బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కేంద్రం ఇచ్చేది రూ.72వేలు మాత్రమేనని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్, అరవింద్ వ్యాఖ్యలు అగౌరవంగా మాట్లాడటం సరికాదన్నారు. బాల్కొండ అభివృద్ది కోసం కేసీఆర్ కాళ్లు మొక్కితే తప్పంటేని ఆయన బీజేపీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.