బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌‌కు ప్రశాంత్ రెడ్డి సవాల్

దిశ, బాల్కొండ: పంట కొనుగోలు కేంద్రాలపై విమర్శలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన పంట కొనుగోలు కేంద్రాలు చూపిస్తే తన ముక్కు నేలకు రాసి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకవేల అలా చేయలేకపోతే వారి పదవులకు రాజీనామా చేస్తారా అని ఆయన ఛాలెంజ్ చేశారు.  నియోజక వర్గంలోని మోర్తాడ్‌‌‌లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో […]

Update: 2021-01-07 08:00 GMT

దిశ, బాల్కొండ: పంట కొనుగోలు కేంద్రాలపై విమర్శలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన పంట కొనుగోలు కేంద్రాలు చూపిస్తే తన ముక్కు నేలకు రాసి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకవేల అలా చేయలేకపోతే వారి పదవులకు రాజీనామా చేస్తారా అని ఆయన ఛాలెంజ్ చేశారు. నియోజక వర్గంలోని మోర్తాడ్‌‌‌లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చెస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. టీఆర్‌‌ఎస్ పార్టీ సంఖ్యా బలం ముందు రాష్ట్ర బీజేపీ బలం చాలా చిన్నదని చెప్పారు. టీఆర్‌‌ఎస్ కార్యకర్తలు తిట్టడం మొదలుపెడితే బీజేపీనేతలు గ్రామల్లో తిరగలేరని తెలిపారు. ఓవైపు కేంద్రంలోని బీజేపీ మంత్రులు సీఎం కేసీఆర్ అమలు చెస్తున్న పథకాలను ప్రశంసిస్తుంటే బండి సంజయ్,అర్వింద్‌లు విమర్శించడం అవివేకమని అన్నారు. కేవలం మూడేండ్లలో భారీ కాళేశ్వరం ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేయించి చరిత్రలో ఎన్నడూ లేనివిదంగా వరద కాలువకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News