ఆ మెడికల్ షాపులను సీజ్ చేయండి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరకు విక్రయించే మెడికల్ షాపులను గుర్తించి, వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డ్రగ్ ఏడీ రాజ్యలక్ష్మిలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అధిక ధరలకు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన మెడికల్ షాపులపై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజలకు వాస్తవ ధరలకు అందేట్టు చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా […]

Update: 2020-08-03 08:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరకు విక్రయించే మెడికల్ షాపులను గుర్తించి, వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డ్రగ్ ఏడీ రాజ్యలక్ష్మిలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అధిక ధరలకు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన మెడికల్ షాపులపై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజలకు వాస్తవ ధరలకు అందేట్టు చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 25 వెంటిలేటర్లు ఉండగా, వాటికి అధనంగా 45 వెంటి లేటర్లు తెప్పించి మొత్తం 70 వెంటి లేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటివరకూ ఆక్సిజన్ ఐసోలేషన్ బెడ్లు-149, ఐసీయూ బెడ్లు-48 అందుబాటులో ఉండగా వాటిని 450 కి పెంచేందుకు వెంటనే రూ.68 లక్షల మంజూరు చేస్తున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లాకు కోవిడ్ చికిత్స కోసం అత్యవసర మందులైన ఫావిబ్లూ 500 స్ట్రిప్పులు,150 రెమిడెసివిర్ వాయిల్స్ ఇంజక్షన్లు, 20 మల్టీ మానిటరింగ్ మీటర్స్, 35 ఐసీయూ ఫోల్డర్ కాట్స్ వెంటనే పంపాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంత్రి చొరవతో జిల్లాకు రేపు కోవిడ్ అత్యవసర మందులు చేరుతాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో తిరుమల, హోప్, మనోరమ, ప్రతిభ ఈ నాలుగు ప్రయివేట్ హాస్పిటల్స్ రెండు, మూడు రోజుల్లో కోవిడ్ చికిత్సను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ నియంత్రణకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని భరోసానిచ్చారు.

Tags:    

Similar News