ఆందోళనలో పరిటాల సునిత.. అసలు ఆ మీటింగ్ లో ఏం జరిగింది?

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత స్పందించారు. జలవివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా అధికారులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లా కరవు జిల్లా అని ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసునని.. ఈ విషయాలను గుర్తెరిగి వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో శనివారం జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో […]

Update: 2021-09-11 08:47 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత స్పందించారు. జలవివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా అధికారులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లా కరవు జిల్లా అని ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసునని.. ఈ విషయాలను గుర్తెరిగి వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో శనివారం జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం పరిస్థితులు కేసీఆర్‌కు పూర్తిగా తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా కూడా వ్యవహరించారని సునీత గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ ప్రాజెక్టుల అంశంలో తక్షణమే స్పందించాలని మాజీమంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.

Tags:    

Similar News