చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ

దిశ, మహబూబ్‌నగర్: నూతనంగా చేపట్టనున్న చెక్‌ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోట  గ్రామ సమీపంలో రూ.4 కోట్ల 90 లక్షల నిధులతో చెక్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అనంతరం మంత్రి కోయిల్‌ సాగర్ నీటి ప్రహవాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి వనరులను వినియోగించేందుకు అని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రైతులకు […]

Update: 2020-05-12 04:18 GMT

దిశ, మహబూబ్‌నగర్: నూతనంగా చేపట్టనున్న చెక్‌ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోట గ్రామ సమీపంలో రూ.4 కోట్ల 90 లక్షల నిధులతో చెక్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అనంతరం మంత్రి కోయిల్‌ సాగర్ నీటి ప్రహవాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి వనరులను వినియోగించేందుకు అని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News