అక్కడ మాదిరి అన్ని జిల్లాలోనూ..

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దశల వారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తికి నూతన సమీకృత మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల మాదిరిగా అన్ని జిల్లాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో రెండెకరాల్లో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో […]

Update: 2020-08-07 05:10 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దశల వారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తికి నూతన సమీకృత మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల మాదిరిగా అన్ని జిల్లాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో రెండెకరాల్లో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, జేడీ శ్రీనివాసులు, ఈఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News