‘పంట నష్టం అంచనా వేయండి’
దిశ, మహబూబ్ నగర్: అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు సంబంధించిన వివరాలను సేకరించి, అంచనాలను సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, వడగండ్ల వాన మూలంగా నేలకొరిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు భారీనష్టం వాటిల్లిందనీ, బీమా కంపెనీల పరిధిలో నష్టపరిహారం అందే అంశాలను అంచనా […]
దిశ, మహబూబ్ నగర్: అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు సంబంధించిన వివరాలను సేకరించి, అంచనాలను సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, వడగండ్ల వాన మూలంగా నేలకొరిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు భారీనష్టం వాటిల్లిందనీ, బీమా కంపెనీల పరిధిలో నష్టపరిహారం అందే అంశాలను అంచనా వేస్తున్నామని చెప్పారు. వాటి పరిధిలోకి రాని రైతులను జాతీయ విపత్తు నిధి ద్వారా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పంట చేతికొచ్చే ప్రస్తుత తరుణంలో వడగండ్ల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం వివరాలు సేకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.
Tags: niranjan reddy, minister, damaged crop fields, unexpected rains, wanaparthi, peddamandhadi, collectors