ధాన్యం కొంటారా లేదా.. కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్..
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతాంగానికి శాపంగా మారాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కొంటారా? కొనరా అన్న విషయంపై స్పష్టతనివ్వాలంటూ గురువారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం తెలంగాణ రైతుల ధాన్యం కొంటామని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రెండు, మూడు పంటలు పండించుకుంటూ రైతన్నలు సంతోషంగా ఉన్న […]
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతాంగానికి శాపంగా మారాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కొంటారా? కొనరా అన్న విషయంపై స్పష్టతనివ్వాలంటూ గురువారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం తెలంగాణ రైతుల ధాన్యం కొంటామని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రెండు, మూడు పంటలు పండించుకుంటూ రైతన్నలు సంతోషంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కేంద్ర వైఖరితో రాష్ట్ర రైతులకు ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
రాష్ట్రంలో 5 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కానీ, కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ గొడవ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం తీసుకుంటున్న అస్పష్టమైన, హేతుబద్ధత లేని విధానాల వల్ల స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగాల్సి వచ్చిందని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాలను సమీక్షించుకొని తెలంగాణకు సహకారం అందించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.