దేశాన్ని అమ్మడానికేనా.. అధికారంలోకి వచ్చింది : మంత్రి నిరంజన్ రెడ్డి

దిశ, వనపర్తి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుండి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు పెట్టి పంపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహించింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకప్పుడు […]

Update: 2021-11-12 04:41 GMT

దిశ, వనపర్తి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుండి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు పెట్టి పంపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహించింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ రాష్ట్రం ఒక్క ఏడాదిలో రెండు కోట్ల మెట్రిక్ టన్నులు పండిస్తే.. దానిని మించి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించిందని గుర్తుచేశారు. వరిధాన్యం కొనే విషయంలో కేంద్రం మడత పెట్టి మాట్లాడకుండా వరిధాన్యాన్ని కొంటారో, లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రం రైతులు పండించిన ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా లేదని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అమ్మేపనిలో నిమగ్నమైందని ఎద్దేవా చేశారు. దేశాన్ని అమ్మడానికే అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాల రైతులు ఏడాదిగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసనలు చేస్తూ.. దాదాపు 600 మంది రైతులు మృతిచెందినా పట్టించుకోకుండా, వారిపై వాహనాలు ఎక్కించి చంపడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని, ఆలోచన హృదయం లేదని అన్నారు. ధర్నా అనంతరం వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

పిచ్చోడ్ని పార్లమెంట్‌కు ఎందుకు పంపారో తెలియడం లేదు.. కేటీఆర్ ఫైర్

Tags:    

Similar News