‘ఆకలి తెలంగాణ.. అన్నపూర్ణగా మారింది’
దిశ, మహబూబ్‌నగర్: ఆకలిదప్పుల తెలంగాణ నేడు కేసీఆర్ నాయకత్వంలో, ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు తెలంగాణను నిర్వీర్యం చేస్తే ఆరేళ్ల స్వయం పాలనలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 220/33 కేవీ సబ్ స్టేషన్‌లో కొల్లాపూర్ కరెంట్ సరఫరాకు మంత్రి ప్రత్యేక ఫీడర్లు […]
దిశ, మహబూబ్‌నగర్: ఆకలిదప్పుల తెలంగాణ నేడు కేసీఆర్ నాయకత్వంలో, ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు తెలంగాణను నిర్వీర్యం చేస్తే ఆరేళ్ల స్వయం పాలనలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 220/33 కేవీ సబ్ స్టేషన్‌లో కొల్లాపూర్ కరెంట్ సరఫరాకు మంత్రి ప్రత్యేక ఫీడర్లు ప్రారంభించారు. అలాగే సింగోటం రిజర్వాయర్ సమీపాన హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న గ్రామాల్లో ధాన్యపురాశులు దర్శనమిస్తున్నాయని, కరెంట్ లేని కాలం నుంచి కరెంట్ పోని స్థితికి వచ్చామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదని వివరించారు. రైతుబంధు కింద రూ.7253 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తూ, ఆసరా పింఛన్లను యథావిధింగా కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూయించిందని ఆరోపించారు. వచ్చే మూడు నెలల్లో సింగోటం నూతన సబ్ స్టేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే త్వరలో కొల్లాపూర్ లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు.