రైతులను మోసం చేస్తుంది కేంద్రం: మంత్రి నిరంజన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ నేతలు తెలంగాణ రైతాంగానికి సమస్యగా మారారని, రైతులు సంతోషంగా ఉంటే వారు ఓర్వలేరని, బీజేపీకి పనీపాటలేదని రాష్ట్ర వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. యాసంగిలో ధాన్యం కొంటారో కొనరో స్పష్టం చేయక బీజేపీ మోసం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి బీజేపీ నేతలు వెళ్లాల్సిన అవసరం ఏమిటి.. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా..కొనుగోలు కేంద్రాల దగ్గర […]

Update: 2021-11-16 11:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ నేతలు తెలంగాణ రైతాంగానికి సమస్యగా మారారని, రైతులు సంతోషంగా ఉంటే వారు ఓర్వలేరని, బీజేపీకి పనీపాటలేదని రాష్ట్ర వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. యాసంగిలో ధాన్యం కొంటారో కొనరో స్పష్టం చేయక బీజేపీ మోసం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి బీజేపీ నేతలు వెళ్లాల్సిన అవసరం ఏమిటి.. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా..కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కాక మరేమీ ఉంటుందని ప్రశ్నించారు.

బీజేపీ నేతలకు అసలు సిగ్గు శరం ఉందా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాసంగిలో వడ్ల కొనుగోలు గురించి మాట్లాడమంటే కేంద్ర మంత్రి మాట్లాడరు.. బీజేపీ నేతలు మాట్లాడరు.. కానీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ, పంజాబ్‌లో రైతులు ఆందోళన చేస్తున్నా మోడీ స్పందించరు. కానీ ఇక్కడ రైతుల పేరిట బీజేపీ నేతలు ఆందోళన చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రైతులకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్మిడి సాయం కూడా కేంద్రం నుంచి రావడం లేదని ఆయన ఆరోపించారు.

రైతుల ధాన్యంపై బీజేపీ నేతలు గుండాల్లా దాడులకు దిగుతున్నారని, బీజేపీ వ్యాపార పార్టీ, కార్పొరేట్ల పార్టీ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న పార్టీ అని మండిపడ్డారు. బీజేపీ నేతలను అజ్ఞానులు అనాలా మూర్ఖులు అనాలా అనేది అర్థం కావడం లేదన్నారు. కొందరు మూర్ఖులు, సన్నాసులు మమ్మల్ని రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యామని అనడం సిగ్గుచేటన్నారు. ఎన్ని వడ్లకు ఎంత బియ్యం ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.

వాట్సాప్ యూనివర్సిటీల్లో బీజేపీ నేతలు వడ్లు, బియ్యం గురించి శుంఠల్లా ప్రచారం చేస్తున్నారని, వారికి బుద్ది బుర్ర లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి యాసంగి వడ్ల కొనుగోలు పై ప్రకటన తీసుకు రావాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలపై బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News