రైతే రాజు కావాలి: నిరంజన్ రెడ్డి
రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వారం రోజుల్లో అన్ని పంటల వివరాలు సేకరించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హాకా భవన్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడూతూ.. ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 38 లక్షల 19 వేల ఏకరాల్లో వరి సాగు అయిందన్నారు. విత్తన ఉత్పత్తి, […]
రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వారం రోజుల్లో అన్ని పంటల వివరాలు సేకరించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హాకా భవన్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడూతూ.. ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 38 లక్షల 19 వేల ఏకరాల్లో వరి సాగు అయిందన్నారు. విత్తన ఉత్పత్తి, మార్కెటింగ్, యాజమాన్య పద్ధతులపై రైతులకు విసృత అవగాహన కల్పించాలన్నారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌టీ కాటన్ పత్తి విత్తనాల సాగుపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.
tag: minister niranjan reddy, comments, farmers