రైతు బంధుపై క్లారిటీ ఇచ్చిన మినిస్టర్
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు నిధులను 3 రోజల్లో 42.43లక్షల మంది రైతులకు పంపిణీ చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 58.85 లక్షల ఎకరాలకు గాను రూ. 2,942.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. రేపు మరో 7.05 లక్షల మంది రైతులకు రూ.1153.50 కోట్లను పంపిణీ చేస్తామన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని 53,381 మంది రైతులకు చెందిన 1,82,542 ఎకరాలకు రూ.91.27 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,300 […]
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు నిధులను 3 రోజల్లో 42.43లక్షల మంది రైతులకు పంపిణీ చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 58.85 లక్షల ఎకరాలకు గాను రూ. 2,942.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. రేపు మరో 7.05 లక్షల మంది రైతులకు రూ.1153.50 కోట్లను పంపిణీ చేస్తామన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని 53,381 మంది రైతులకు చెందిన 1,82,542 ఎకరాలకు రూ.91.27 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,300 మంది రైతులకు చెందిన 7,212 ఎకరాలకు రూ.36.05 లక్షలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ప్రకటించారు. మొత్తం నాలుగు రోజుల్లో రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాలలో రూ.4095.77 కోట్లు జమకానున్నాయని వివరించారు.