ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అయితే..

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అయినా అనేక వినూత్న పథకాలతో యావత్తు దేశ దృష్టిని ఆకర్షించి ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతీ పల్లెకు సర్వం సమకూరాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ప్రధాని అయితే భారత్ ముఖచిత్రమే మారిపోతుందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని అయ్యే అవకాశం ఒక్కసారి వచ్చినా మొత్తం దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు లభిస్తాయన్నారు. తెలంగాణ […]

Update: 2021-03-25 05:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అయినా అనేక వినూత్న పథకాలతో యావత్తు దేశ దృష్టిని ఆకర్షించి ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతీ పల్లెకు సర్వం సమకూరాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ప్రధాని అయితే భారత్ ముఖచిత్రమే మారిపోతుందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని అయ్యే అవకాశం ఒక్కసారి వచ్చినా మొత్తం దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే సాగునీరు, తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటివన్నీ సమకూరాయన్నారు. అన్ని సెక్షన్ల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించిన సీఎం ఆదర్శవంతమైన పాలన అందించారని, ఒక్కసారి ప్రధాని అయితే ఇక దేశమే అబ్బురపడుతుందన్నారు.

కార్మిక శాఖ పద్దులపై అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. వలస కార్మికులను సొంత రాష్ట్ర పౌరులుగా చూసుకున్న కేసీఆర్ వారి కడుపు నింపారని, వారి సంక్షేమం కోసం తపించారన్నారు. ముఖ్యమంత్రి కావడంతోనే రాష్ట్రం కొత్త పుంతలు తొక్కిన పరిస్థితుల్లో ఇక ప్రధాని అయితే దేశం మొత్తం ఎలా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక్కసారైనా ఆయన ప్రధాని కావాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News