మరోసారి రేవంత్‌ను రెచ్చగొట్టిన మల్లారెడ్డి (వీడియో)

దిశ ప్రతినిధి, మేడ్చల్: టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డిపై కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం జవహర్ నగర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను తిడితే ఊరుకోబోమని, ఉరికిచ్చి తరిమి కొడుతామని హెచ్చరించారు. రూ.50 కోట్లతో రేవంత్ రెడ్డి పీసీసీ పదవినికి కొనుక్కున్నాడని సంచలన ఆరోపణ చేశారు. జైలుకెళ్లిన దగుల్జాబీ అని మండిపడ్డాడు. సీఎం గొప్ప […]

Update: 2021-09-19 03:46 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డిపై కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం జవహర్ నగర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను తిడితే ఊరుకోబోమని, ఉరికిచ్చి తరిమి కొడుతామని హెచ్చరించారు. రూ.50 కోట్లతో రేవంత్ రెడ్డి పీసీసీ పదవినికి కొనుక్కున్నాడని సంచలన ఆరోపణ చేశారు. జైలుకెళ్లిన దగుల్జాబీ అని మండిపడ్డాడు. సీఎం గొప్ప మనిషి, గొప్ప మహనీయుడు అని కేసీఆర్‌ను అకాశానికి ఎత్తేశారు. గతంలో 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు. ‘ఖబర్దార్ అరేయ్ రేవంత్ రెడ్డి. నిన్నువిడిచేదే లేదు.’ అని మంత్రి హెచ్చరించారు.

Tags:    

Similar News