కేసీఆర్ మానస పుత్రికను పట్టించుకోని మంత్రి మల్లారెడ్డి….
దిశ, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు సాక్షాత్తు కేసీఆర్ మానస పుత్రికగా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాంటి కేసీఆర్ మానస పుత్రికను మేడ్చల్ మున్సిపాలిటీలో పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టణాలు కళకళలాడాలి, డ్రైనేజ్ శుభ్రంగా ఉండాలి, ఇది పట్టణ ప్రగతి లక్ష్యమంటూ మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలు చేశారు. ఈనెల 1 నుండి 10వ […]
దిశ, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు సాక్షాత్తు కేసీఆర్ మానస పుత్రికగా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాంటి కేసీఆర్ మానస పుత్రికను మేడ్చల్ మున్సిపాలిటీలో పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టణాలు కళకళలాడాలి, డ్రైనేజ్ శుభ్రంగా ఉండాలి, ఇది పట్టణ ప్రగతి లక్ష్యమంటూ మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలు చేశారు. ఈనెల 1 నుండి 10వ తేదీ వరకు మేడ్చల్ మున్సిపాలిటీ లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
పారిశుద్ధ్యం కోసం ప్రతి వార్డు లో నిధులు కేటాయించారు. స్పెషల్ ఆఫీసర్ ను నియమించారు. కానీ పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యం మాత్రం కనబడటం లేదు. మేడ్చల్ మున్సిపాలిటీ లో పలు వార్డులలో చెత్తా చెదారంతో డ్రైనేజీ పొంగుతూ అధ్వానంగా ఉంది. శనివారంతో పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసింది. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఉన్న మున్సిపాలిటీలు పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.