మేడ్చల్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: మల్లారెడ్డి
దిశ,మేడ్చల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పట్టణ ప్రగతిని రూపకల్పన చేయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల్లో చేపట్టబోయే పనులపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు.. అంటే జూన్ 1 నుంచి 8వ తేది వరకు చేపట్టే కార్యక్రమాలన్నింటినీ పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. అంతేకాకుండా, పట్టణ ప్రగతిలో మేడ్చల్ […]
దిశ,మేడ్చల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పట్టణ ప్రగతిని రూపకల్పన చేయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల్లో చేపట్టబోయే పనులపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు.. అంటే జూన్ 1 నుంచి 8వ తేది వరకు చేపట్టే కార్యక్రమాలన్నింటినీ పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. అంతేకాకుండా, పట్టణ ప్రగతిలో మేడ్చల్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, జాన్ శాంసన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.