అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ
దిశ, మేడ్చల్: సకల జనుల పోరాటం.. అమర వీరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కీసర చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే సమర్థవంతమైన, సుస్థిర నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం రెండోవిడత పట్టణ ప్రగతిలో భాగంగా.. […]
దిశ, మేడ్చల్: సకల జనుల పోరాటం.. అమర వీరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కీసర చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే సమర్థవంతమైన, సుస్థిర నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం రెండోవిడత పట్టణ ప్రగతిలో భాగంగా.. అహ్మద్‌గూడలో, శామీర్ పేట మండలంలోని రాజీవ్ రహదారికి ఇరువైపుల మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్ రావు, జనార్థన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, జాన్ శ్యాంసన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తదితరులు పాల్గొన్నారు.