దాతలు ముందుకు రావాలి: మంత్రి మల్లారెడ్డి
దిశ, మేడ్చల్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరుపేదలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి నుంచి కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో దాతల సహకారంతో 900 మంది పేదలకు 100 క్వింటాళ్ల బియ్యం, కూరగాయలు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో […]
దిశ, మేడ్చల్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరుపేదలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి నుంచి కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో దాతల సహకారంతో 900 మంది పేదలకు 100 క్వింటాళ్ల బియ్యం, కూరగాయలు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా పరిశ్రమలన్నీ లాక్‌డౌన్ పాటిస్తున్న కారణంగా అక్కడ పనిచేసే కార్మికులు, వలస కూలీలు పస్తులు ఉండకుండా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు చెప్పారు. పేదలకు సాయం చేస్తోన్న దాతలను అభినందించారు. అంతకు ముందు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్ననగర్ క్లాసిక్ గార్డెన్‌లో దాతల సహకారంతో దాదాపు వెయ్యిమంది వలస కూలీలకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిత్యం వెయ్యి మంది కార్మికులకు మధ్యాహ్నాం, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మల్కాజిగిరి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ముప్పిడి గోపాల్, బేగంపేట సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
tag: malla reddy, Essentials supply, annadhanam, Migrant laborers, poor people, Donors, medchal