గోవులను బలి ఇవ్వొద్దు
దిశ, క్రైమ్‌బ్యూరో: బక్రీద్ పండగ రోజు గోవులను బలి ఇవ్వొద్దని హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని పోలీసుశాఖ తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటామని తెలిపారు. అదే తరహాలో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. చార్మినార్‌లోని నాలుగు మినార్లు హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లుగా భావిస్తామని ఈ విధంగా అన్ని మతాలను, కులాలను సమానంగా […]
దిశ, క్రైమ్‌బ్యూరో: బక్రీద్ పండగ రోజు గోవులను బలి ఇవ్వొద్దని హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని పోలీసుశాఖ తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటామని తెలిపారు. అదే తరహాలో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. చార్మినార్‌లోని నాలుగు మినార్లు హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లుగా భావిస్తామని ఈ విధంగా అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
హిందూవులు గోవులను పూజిస్తున్నందున ఎప్పటిలాగే వాటిని బలి ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోంమంత్రి కోరారు. ప్రార్థనలు, జంతువుల అమ్మకం, కొనుగోలు సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సురక్షితమైన చర్యలతో పాటు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని హోంమంత్రి తెలిపారు.