కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు కేటీఆర్ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ల్యాబ్‌తో పాటు, ప్రభుత్వ మందుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీకి రాజధానిగా ఉన్నదని, 60బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రధాని నరేంద్ర మోడీతో సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీలో పర్యటించారని, భారత […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ల్యాబ్‌తో పాటు, ప్రభుత్వ మందుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీకి రాజధానిగా ఉన్నదని, 60బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రధాని నరేంద్ర మోడీతో సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీలో పర్యటించారని, భారత వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే ఈ రెండు నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.