ఈ ఏడాది 85వేల ‘డబుల్ ఇళ్ల’ పంపిణీ : కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.9,700 కోట్లతో దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని […]

Update: 2020-08-26 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.9,700 కోట్లతో దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. చాలాచోట్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. దీంతో తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఆగస్టు చివరి నుంచి డిసెంబర్‌ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్‌ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని.. దీంతో వాటిని వెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్లతోపాటు, జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ విభాగం అధికారులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News