ప్రభుత్వం చెబితే రైతులు విన్నారు

దిశ, న్యూస్‌బ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేబితే రైతులు విన్నారని, డిమాండ్ ఉండే వ్యవసాయ పంటలే వేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సూచన మేరకు పెద్ద ఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ పట్ల అచంచల విశ్వాసం ఉండటంవల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి […]

Update: 2020-08-31 10:08 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేబితే రైతులు విన్నారని, డిమాండ్ ఉండే వ్యవసాయ పంటలే వేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సూచన మేరకు పెద్ద ఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ పట్ల అచంచల విశ్వాసం ఉండటంవల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వం మాదనేది మరో మారు స్పష్టం చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News