ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యత

దిశ, న్యూస్​బ్యూరో: నగర సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యల్లో భాగంగా ట్రాఫిక్ స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. స‌న‌త్‌న‌గ‌ర్- బాలాన‌గ‌ర్ పారిశ్రామిక ప్రాంతాల‌ను కలుపుతూ రూ. 68.30 కోట్లతో నిర్మించ‌నున్న నాలుగు లైన్ల రైల్వే అండ‌ర్ బ్రిడ్జి (ఆర్​యూబీ), ఫ‌తేన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్​కు సమాంతరంగా రూ. 45 కోట్ల వ్యయంతో నిర్మించ‌నున్న రెండులేన్ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌కు మంత్రి త‌ల‌సాని​తో క‌లిసి కేటీఆర్​ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ న‌గ‌రంలో […]

Update: 2020-07-29 06:50 GMT

దిశ, న్యూస్​బ్యూరో: నగర సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యల్లో భాగంగా ట్రాఫిక్ స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. స‌న‌త్‌న‌గ‌ర్- బాలాన‌గ‌ర్ పారిశ్రామిక ప్రాంతాల‌ను కలుపుతూ రూ. 68.30 కోట్లతో నిర్మించ‌నున్న నాలుగు లైన్ల రైల్వే అండ‌ర్ బ్రిడ్జి (ఆర్​యూబీ), ఫ‌తేన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్​కు సమాంతరంగా రూ. 45 కోట్ల వ్యయంతో నిర్మించ‌నున్న రెండులేన్ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌కు మంత్రి త‌ల‌సాని​తో క‌లిసి కేటీఆర్​ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ న‌గ‌రంలో ఏ ప‌నినైనా మొద‌ట‌గా స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే శ్రీ‌కారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ రైల్వే అండ‌ర్ బ్రిడ్జి నిర్మాణంతో స‌న‌త్‌న‌గ‌ర్, న‌ర్సాపూర్ చౌర‌స్తా, జీడిమెట్ల ప్రయాణాలకు సులభంగా ఉంటుందన్నారు. ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయించాల‌ని హెచ్ఆర్‌డిసిఎల్ అధికారుల‌ను ఆదేశించారు.

అనంతరం మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ ఏ నియోజ‌క‌వ‌ర్గానికి లేనివిధంగా స‌న‌త్‌న‌గ‌ర్​కు ప్రత్యేక రిజ‌ర్వాయ‌ర్‌ను నిర్మించిన‌ట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియం ప‌నులు పూర్తి అయ్యాయ‌ని, త్వర‌లోనే ప్రజ‌ల వినియోగంలోకి తేనున్నట్లు తెలిపారు. మ‌హాప్రస్థానానికి ధీటుగా బ‌ల్కంపేట శ్మశాన‌వాటిక‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స‌న‌త్‌న‌గ‌ర్ ప్రాంత ప్రజ‌ల చిర‌కాల కోరిక‌గా ఉన్న రైల్వే అండ‌ర్ బ్రిడ్జి, ఫ్లైఓవ‌ర్లను మంజూరు చేసిన మంత్రి కేటీఆర్​కు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల త‌రుపున కృత‌జ్ఞత‌లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, హెచ్​ఆర్​డీసీఎల్ సీఈ సి.వ‌సంత‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావిణ్య, సీసీపీ దేవేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News