ఎలివేటేడ్ కారిడార్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
దిశ, న్యూస్‌బ్యూరో: రూ. 523 కోట్ల 37 లక్షల వ్యయంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు గురువారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3.82 కిలోమీటర్ల ఈ ఎలివేటెడ్ కారిడార్‌లో 2.58 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ తో పాటు రెండు వైపులా ర్యాంప్ నిర్మాణం చేపడుతున్నారు. నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌తో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్, ఓవైసీ జంక్షన్ల మధ్య ట్రాఫిక్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: రూ. 523 కోట్ల 37 లక్షల వ్యయంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు గురువారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3.82 కిలోమీటర్ల ఈ ఎలివేటెడ్ కారిడార్‌లో 2.58 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ తో పాటు రెండు వైపులా ర్యాంప్ నిర్మాణం చేపడుతున్నారు. నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌తో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్, ఓవైసీ జంక్షన్ల మధ్య ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కరమవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ఆధునిక టెక్నాలజితో చేపడుతున్నారు. శంకుస్థాపన అనంతరం కేటీఆర్ మాట్లాడకుండానే కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహ్మద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.