కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు..!
దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా కట్టడిలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మంగళవారం ప్రగతి భవన్లో మంత్రి మల్లారెడ్డి సమకూర్చిన కరోనా టెస్టింగ్ అంబులెన్సులను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబులెన్స్ సేవలను కరోనా బాధితులు వినియోగించుకోవాలన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. […]
దిశ ప్రతినిధి, మేడ్చల్:
కరోనా కట్టడిలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మంగళవారం ప్రగతి భవన్లో మంత్రి మల్లారెడ్డి సమకూర్చిన కరోనా టెస్టింగ్ అంబులెన్సులను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబులెన్స్ సేవలను కరోనా బాధితులు వినియోగించుకోవాలన్నారు.
ఇక మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపు మేరకు గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా అత్యాధునిక అంబులెన్స్‌లను సమకూర్చినట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కొరకు తన వంతు సహాయంగా కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు.