పెను సవాల్‌గా సైబర్ సెక్యూరిటీ : కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా, గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అనేవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు అని, వాటికి చెక్ పెట్టడంలో ‘ఇవాంటి’ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఐటీ అసెట్స్‌ను భద్రపరిచే ప్లాట్‌ఫామ్ అయిన ‘ఇవాంటి’ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఇవాంటి’ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా, గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అనేవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు అని, వాటికి చెక్ పెట్టడంలో ‘ఇవాంటి’ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఐటీ అసెట్స్‌ను భద్రపరిచే ప్లాట్‌ఫామ్ అయిన ‘ఇవాంటి’ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఇవాంటి’ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సర్వీస్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ గ్రూప్ అండ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నయ్యర్, సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీఈఓ, డాక్టర్ శ్రీరామ్ బిరుదవోలు , సెక్యూరిటీ ప్రొడక్ట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ ముక్కామల, తదితరులు పాల్గొన్నారు.