బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. మంత్రి కేటీఆర్ ట్విస్ట్

దిశ, వెబ్‌డెస్క్ : నగరం నడిబొడ్డున నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చాలా ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ వంతెనకు తెలంగాణ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ అని నామకరణం చేసింది. అంతేకాకుండా కూకట్ పల్లి నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు, అండర్ పాసులు నిర్మిస్తున్నట్లు మంత్రి […]

Update: 2021-07-06 00:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నగరం నడిబొడ్డున నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చాలా ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ వంతెనకు తెలంగాణ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ అని నామకరణం చేసింది. అంతేకాకుండా కూకట్ పల్లి నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు, అండర్ పాసులు నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు కూకట్ పల్లి, జీడిమెట్ల, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ ప్రాంత వాసులకు ప్రయోజనం చేకూరనుంది.

అయితే, వంతెన నిర్మాణ సమయంలో పనిచేసిన కార్మికురాలు శివమ్మతో మంత్రి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ చేయించి అందిరికీ ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు జేబీఎస్ నుంచి స్కైవే కోసం ప్లాన్ చేశామని, కేంద్రం నుంచి అనుమతి లేకపోవడంతో పెండింగ్ లోనే ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, మేయర్ విజయలక్ష్మి, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Tags:    

Similar News