ఇదెక్కడి న్యాయం.. మీకు 85% మాకు 15% కేటాయింపులా : కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ కేటాయింపుల విషయంలో కేంద్రం తీరుపై ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌లో కేంద్రం 85శాతం తన వద్ద పెట్టుకుని కేవలం 15శాతం రాష్ట్రాలకు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్ సప్లయ్ జరగడం లేదని విమర్శించారు. ఈ సమయంలో విదేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వడం ఎంటనీ మంత్రి ప్రశ్నించారు. గురువారం వేములవాడలో 100 […]

Update: 2021-05-28 07:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ కేటాయింపుల విషయంలో కేంద్రం తీరుపై ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌లో కేంద్రం 85శాతం తన వద్ద పెట్టుకుని కేవలం 15శాతం రాష్ట్రాలకు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్ సప్లయ్ జరగడం లేదని విమర్శించారు.

ఈ సమయంలో విదేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వడం ఎంటనీ మంత్రి ప్రశ్నించారు. గురువారం వేములవాడలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో నమోదవుతున్న బ్లాక్, వైట్ ఫంగస్ కేసుల కోసం యాంటి ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కరోనా శాశ్వత నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ఉత్తమమైన మార్గమమని స్పష్టంచేశారు.

Tags:    

Similar News