బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్‎ను అమ్మేస్తుంది

దిశ, వెబ్‎డెస్క్: బీజేపీ చార్జిషీట్‎పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. 98.31 శాతం ఇళ్లకు తాగు నీరందిస్తే చార్జిషీట్ వేస్తారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి కేంద్రం యువత పొట్టకొట్టిందని విమర్శించారు. తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందన్నారు. వేల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అముతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్ […]

Update: 2020-11-24 03:13 GMT

దిశ, వెబ్‎డెస్క్: బీజేపీ చార్జిషీట్‎పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. 98.31 శాతం ఇళ్లకు తాగు నీరందిస్తే చార్జిషీట్ వేస్తారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి కేంద్రం యువత పొట్టకొట్టిందని విమర్శించారు. తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందన్నారు. వేల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అముతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్ ను అమ్మేస్తుందని అన్నారు.

Tags:    

Similar News