త్వరలో పీఎంగా మంత్రి కేటీఆర్.. జీవన్ రెడ్డి సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. బుధవారం టీఆర్ఎస్ ఎల్‌పీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ రాబోయే 10-20 ఏళ్లలో ప్రధానమంత్రి అవుతారని అన్నారు. కేటీఆర్ మాట్లాడితే.. అందరూ అవాక్కవ్వాల్సిందేనని.. ప్రాంతీయ పార్టీలో ఇంతటి గొప్ప నాయకుడు ఎలా వచ్చారని అందరూ అసూయ పడుతున్నట్లు ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో […]
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. బుధవారం టీఆర్ఎస్ ఎల్‌పీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ రాబోయే 10-20 ఏళ్లలో ప్రధానమంత్రి అవుతారని అన్నారు. కేటీఆర్ మాట్లాడితే.. అందరూ అవాక్కవ్వాల్సిందేనని.. ప్రాంతీయ పార్టీలో ఇంతటి గొప్ప నాయకుడు ఎలా వచ్చారని అందరూ అసూయ పడుతున్నట్లు ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉండటానికి కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలేనని ఆరోపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలిచాక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు ఎర్రగడ్డలో చేరాల్సిందేనని తెలిపారు.