‘చిచ్చు పెట్టి లబ్ధి పొందాలి.. అదే బీజేపీ ప్లాన్’

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అల్లాపూర్ చౌరస్తా నుంచి రోడ్ షో నిర్వహించిన ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. నగరంలోని వరద బాధితులను ఆదుకునేందుకు సాయం చేస్తుంటే.. కావాలనే రూ. 10 వేలను అడ్డుకున్నారని విమర్శించారు. దీనికి తోడు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ వద్దకు వచ్చి డ్రామాలు చేశారన్నారు. గత ఆరేండ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేయలేదని చెప్పిన […]

Update: 2020-11-21 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అల్లాపూర్ చౌరస్తా నుంచి రోడ్ షో నిర్వహించిన ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. నగరంలోని వరద బాధితులను ఆదుకునేందుకు సాయం చేస్తుంటే.. కావాలనే రూ. 10 వేలను అడ్డుకున్నారని విమర్శించారు. దీనికి తోడు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ వద్దకు వచ్చి డ్రామాలు చేశారన్నారు.

గత ఆరేండ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేయలేదని చెప్పిన కేటీఆర్.. అదే ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టామన్నారు. అటువంటి నగరంలో అలజడులు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌ను ఆగమాగం చేస్తున్నారని.. అలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. హిందువులు-ముస్లింలు కలిసి ఉండటం బీజేపీకి నచ్చడం లేదన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రమోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Tags:    

Similar News