‘చూపు లేకపోయినా.. ఆత్మవిశ్వాసంతో రాణించారు’
దిశ ప్రతినిధి, హైదరాబాద్: దృష్టిలోపం ఉన్న వారు నిరాశ చెందకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని జీవితంలో రాణించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. లూయీస్ బ్రెయిలీ 212వ జయంతి సందర్భంగా సోమవారం వికలాంగుల సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెయిలీ విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అంధుల కోసం లూయిస్ బ్రెయిలీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. దివ్యాంగులకు జీవితాన్ని చూపిన మహోన్నత […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: దృష్టిలోపం ఉన్న వారు నిరాశ చెందకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని జీవితంలో రాణించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. లూయీస్ బ్రెయిలీ 212వ జయంతి సందర్భంగా సోమవారం వికలాంగుల సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెయిలీ విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అంధుల కోసం లూయిస్ బ్రెయిలీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. దివ్యాంగులకు జీవితాన్ని చూపిన మహోన్నత మైన వ్యక్తి అని కొనియాడారు. చిన్నతనంలో చూపు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళారని అన్నారు. రాబోయే రోజుల్లో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.