జగన్ పాలనకు రెండేళ్లు.. అడ్డగాడిద అతడే అన్న కొడాలి నాని
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఎప్పుడూ లేనివిధంగా గత రెండేళ్లలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. 2014లో చంద్రబాబుకు ఎందుకు అధికారం ఇచ్చామని బాధపడ్డ ప్రజలు.. అదే సమయంలో జగన్ సీఎం అయితే ఇంకెంత అభివృద్ధి చేసేవారో అని చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలోనే అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని విమర్శించారు. కానీ, […]
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఎప్పుడూ లేనివిధంగా గత రెండేళ్లలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. 2014లో చంద్రబాబుకు ఎందుకు అధికారం ఇచ్చామని బాధపడ్డ ప్రజలు.. అదే సమయంలో జగన్ సీఎం అయితే ఇంకెంత అభివృద్ధి చేసేవారో అని చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలోనే అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని విమర్శించారు. కానీ, జగన్ మాత్రం ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లాగా భావించి అన్నింటినీ నెరవేర్చారని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటుకు మారుపేరుగా నిలిచారని.. మహానుభావుడు ఎన్టీఆర్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి భారత రత్న ఇస్తామంటే.. అడ్డుకున్న అడ్డగాడిద చంద్రబాబు అంటూ కొడాలి నాని ఘాటు ఆరోపణలు చేశారు.