చంద్రబాబుకు భువనేశ్వరి శాపం.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు.. వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్లు చెప్పినా వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. చంద్రబాబుకు కుట్రలు పన్నడం వెన్నతో పెట్టిన విద్య. భార్యను అడ్డం పెట్టుకొని ఎవరైనా రాజకీయాలు చేస్తారా? భువనేశ్వరి శాపం […]
దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు.. వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్లు చెప్పినా వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. చంద్రబాబుకు కుట్రలు పన్నడం వెన్నతో పెట్టిన విద్య. భార్యను అడ్డం పెట్టుకొని ఎవరైనా రాజకీయాలు చేస్తారా? భువనేశ్వరి శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది. ఆడవాళ్ల ఉసురు తగిలి చంద్రబాబు సర్వనాశనం అవుతారు అంటూ మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు.
మీడియా ముందుకు నారా భువనేశ్వరి.. ఆ వ్యాఖ్యలపై రియాక్షన్ ఇదే..!
చంద్రబాబుకు కుట్రలు పుట్టుకతోనే వచ్చాయి. చంద్రబాబు చెబుతున్న మాటలు నిజమని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి వైదొలుగుతా. హైద్రాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డులను తానే కట్టించానని చంద్రబాబు చేసే ప్రకటనలు సత్యదూరం. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు తన హయంలో జరిగిన అభివృద్దిగా చెప్పుకొంటున్నాడు. చంద్రబాబు చెప్పే మాటలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నా సవాల్ స్వీకరించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది అంటూ మంత్రి కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు.