పంట నష్టపోతే అదే ఏడాది రాయితీ ఇస్తాం..
దిశ, వెబ్ డెస్క్: రబీ పంట మార్కెటింగ్ కోసం ప్రణాళికలను సిద్దం చేశామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు ఏ పంట పండించినా మార్కెటింగ్ సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించినట్టు తెలిపారు. 62 లక్షల టన్నుల వరి కొనుగోల్లే లక్ష్యమని వెల్లడించారు. 2.60 వేల టన్నుల మొక్క జొన్నను కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. 5వేలకు పైగా […]
దిశ, వెబ్ డెస్క్: రబీ పంట మార్కెటింగ్ కోసం ప్రణాళికలను సిద్దం చేశామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు ఏ పంట పండించినా మార్కెటింగ్ సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించినట్టు తెలిపారు. 62 లక్షల టన్నుల వరి కొనుగోల్లే లక్ష్యమని వెల్లడించారు. 2.60 వేల టన్నుల మొక్క జొన్నను కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. 5వేలకు పైగా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తామని అన్నారు. పెట్టుబడి రాయితీపై సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏడాది పంట నష్టపోతే అదే ఏడాది రాయితీని రైతులకు ఇస్తామని తెలిపారు. అక్టోబర్ నెలలో పంట నష్ట పరిహారం నవంబర్ లో నేరుగా రైతు ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.510 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. కొత్తగా విత్తనోత్పత్తి విధానం తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు.