మీకు పోటీకి అభ్యర్థులే లేరంటూ.. ప్రతిపక్షాల పరువు తీసిన మంత్రి
దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ కోటిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమయిందన్నారు. ప్రతిపక్షాలు […]
దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ కోటిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమయిందన్నారు. ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదని.. సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి, ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటపై నిలబడ్డ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను వ్యవసాయంలో అగ్రగామిగా నిలిపి, ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డి మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి, కేటీఆర్ కు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఎంసీ కోటిరెడ్డిని అందరూ ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో మోత్కుపల్లి నరసింహులు, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్ర నాయక్, భాస్కర్ రావు, సూర్యాపేట జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.