రెండు వార్డులు మినహా సూర్యాపేట కంటైన్‌మెంట్ జోన్

దిశ, నల్లగొండ: జిల్లా కేంద్రం సూర్యాపేటలో దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‎‌రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటలో రెండు వార్డులు మినహా పట్టణం మొత్తం కంటైన్‌మెంట్ ప్రాంతంగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కంటైన్‌మెంట్ కేంద్రాలుగా గుర్తించిన […]

Update: 2020-04-17 06:07 GMT

దిశ, నల్లగొండ: జిల్లా కేంద్రం సూర్యాపేటలో దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‎‌రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటలో రెండు వార్డులు మినహా పట్టణం మొత్తం కంటైన్‌మెంట్ ప్రాంతంగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కంటైన్‌మెంట్ కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూరగాయలు, నిత్యావసర వస్తువులతోపాటు ఔషధాలను అందిస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని, ఇంటి వద్దకే వచ్చి అన్నిరకాల పెన్షన్లను అందజేస్తున్నామని వివరించారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటూ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణ, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

tag: Minister Jagadish Reddy, review, officials, suryapet

Tags:    

Similar News