కాంగ్రెస్ నేతలు శనిలా దాపురించారు: జగదీశ్‌రెడ్డి

దిశ, నల్లగొండ: రాష్ట్రానికి కాంగ్రెస్ నేతలు శనిలాగా దాపురించారని, వారి తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న నియంత్రిత సాగు విధానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూ రైతు వ్యతిరేకులుగా మారారన్నారు. 24గంటల కరెంట్, నీళ్లు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కానీ రైతులు పంటకు మార్కెట్‌లో […]

Update: 2020-05-27 02:42 GMT

దిశ, నల్లగొండ: రాష్ట్రానికి కాంగ్రెస్ నేతలు శనిలాగా దాపురించారని, వారి తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న నియంత్రిత సాగు విధానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూ రైతు వ్యతిరేకులుగా మారారన్నారు. 24గంటల కరెంట్, నీళ్లు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కానీ రైతులు పంటకు మార్కెట్‌లో ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదని, అందుకే రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ రైతులను ఐక్యం చేసేందుకు నియంత్రిత విధానాన్ని ముందుకు తెచ్చారని కొనియాడారు. ఏ పంటలకు డిమాండ్ ఉందో అధ్యయనం చేసి ఆ పంటలనే సాగు చేసేందుకు సమాయత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాళేశ్వరం జలాలు సందడి చేయబోతున్నాయని, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దని కోర్టులో కేసులు వేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితరాంచంద్రన్, రైతు బంధు జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్, రైతుబంధు సభ్యులు ఉన్నారు.

Tags:    

Similar News