డీజీపీకి మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ :‘వారిపై వెంటనే చర్యలు తీసుకొండి’…
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో డ్యూటీకి వెళ్తున్న విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందని, అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని సూచించారు. రాత్రనక పగలనక పనిచేస్తున్న విద్యుత్ సిబ్బంది పై దాడులు చేసిన వారిని గుర్తించాలని మంత్రి ఆదేశించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యహరించాలని, అదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాలని […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో డ్యూటీకి వెళ్తున్న విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందని, అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని సూచించారు. రాత్రనక పగలనక పనిచేస్తున్న విద్యుత్ సిబ్బంది పై దాడులు చేసిన వారిని గుర్తించాలని మంత్రి ఆదేశించారు.
పోలీసులు చట్టబద్ధంగా వ్యహరించాలని, అదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఐడి కార్డులు చూడకుండా లాఠీలకు పని చెప్పొద్దని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనలపై డీఐజీ రంగనాథ్‌తో మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.