ఆ శాఖలో… కోరుకున్న చోట ఉద్యోగం కల్పిస్తాం

దిశ ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది ఒక దురదృష్టకర ఘటనగా మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన సూర్యాపేట చివ్వెంల మండలం జగన్‌నాయక్‌ తండాకు చెందిన ఏఈ సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను బుధవారం మంత్రి పరామర్శించారు. సుందర్ నాయక్ భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడి, వారికి దైర్యం చెప్పి, సంతాపం తెలిపారు. అనంతరం మంత్రి […]

Update: 2020-08-26 05:21 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది ఒక దురదృష్టకర ఘటనగా మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన సూర్యాపేట చివ్వెంల మండలం జగన్‌నాయక్‌ తండాకు చెందిన ఏఈ సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను బుధవారం మంత్రి పరామర్శించారు. సుందర్ నాయక్ భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడి, వారికి దైర్యం చెప్పి, సంతాపం తెలిపారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ… సుందర్ నాయక్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. అంతేగాకుండా ఇదే శాఖలో సుందర్ నాయక్ భార్య కోరుకున్న చోట ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సుందర్ నాయక్ భార్య పిల్లల చదువుల దృష్ట్యా తనకు హైదరాబాద్‌లో ఉద్యోగం కావాలని మంత్రిని కోరగా, అందుకు మంత్రి వెంటనే సరే అని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, ధైర్య సాహసాలు ప్రదర్శించిన మంత్రిని పలువురు అభినందించారు.

Tags:    

Similar News