తల్లి బిడ్డల ప్రేమ వంటిది పచ్చదనం.. హరీష్ ట్వీట్

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోకి ఇటు హైదరాబాద్ నుండి అటు కరింనగర్ నుండి ప్రవేశించగానే మొదట పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం దర్శనమిస్తుంది. పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యలో పెట్టిన చెట్లు వర్షాకాలం కావడంతో ఏపుగా పెరిగి పచ్చగా దర్శనమిస్తున్నాయి. అలాగే సిద్దిపేటలోని సుడా కార్యాలయంలో సుందరీకరణ పనులు చేపట్టారు. గడ్డితో అభివృద్ధి చేయబడిన ‘తల్లి, బిడ్డల చిహ్నం’ విగ్రహం ఆకర్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పనుల కోసం సుడా కార్యాలయానికి వచ్చి వెళ్ళే వారు అక్కడ […]

Update: 2021-09-07 11:04 GMT

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోకి ఇటు హైదరాబాద్ నుండి అటు కరింనగర్ నుండి ప్రవేశించగానే మొదట పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం దర్శనమిస్తుంది. పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యలో పెట్టిన చెట్లు వర్షాకాలం కావడంతో ఏపుగా పెరిగి పచ్చగా దర్శనమిస్తున్నాయి. అలాగే సిద్దిపేటలోని సుడా కార్యాలయంలో సుందరీకరణ పనులు చేపట్టారు. గడ్డితో అభివృద్ధి చేయబడిన ‘తల్లి, బిడ్డల చిహ్నం’ విగ్రహం ఆకర్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పనుల కోసం సుడా కార్యాలయానికి వచ్చి వెళ్ళే వారు అక్కడ ఫోటోలు , సెల్పీలు దిగుతూ ఉంటారు. సూడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన తల్లి, బిడ్డల చిహ్నం’ విగ్రహం చూసి తన ఆనందాన్ని మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Tags:    

Similar News