అనాథ బాలుడికి అండగా నిలిచిన మంత్రి హరీష్ రావు

దిశ, గజ్వేల్: అనాథ బాలుడికి మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ అనే బాలుడి తల్లిదండ్రులు గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దుర్గా ప్రసాద్‌కు లక్ష రూపాయలు మంజూరు చేశారు. […]

Update: 2021-10-01 08:10 GMT

దిశ, గజ్వేల్: అనాథ బాలుడికి మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ అనే బాలుడి తల్లిదండ్రులు గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దుర్గా ప్రసాద్‌కు లక్ష రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం బాలుడికి చెక్ అందజేశారు. ః

అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడని అన్నారు. అనాథ పిల్లలకు అండగా ఉంటూ భరోసా ఇస్తున్నారని కొనియాడారు. దుర్గా ప్రసాద్‌కు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా… దుర్గా ప్రసాద్‌ను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. అనాథల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండుగౌడ్, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News