టూరిజం డెస్టినేషన్‌గా ‘కోమటి చెరువు’

దిశ, సిద్ధిపేట : రాష్ట్రానికి రోల్ మోడల్‌, పర్యాటక దిక్సూచిగా సిద్ధిపేట కోమటి చెరువు మారనుంది. మినీ ట్యాంక్ బండ్‌గా ఎంతో గొప్ప పర్యాటక శోభను సంతరించుకోనుందని, కోమటి చెరువు పర్యాటక అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరైనట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా కోమటి చెరువును సందర్శించిన విషయం తెలిసిందే. నాడు ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ కోమటి చెరువు […]

Update: 2021-04-07 08:59 GMT

దిశ, సిద్ధిపేట : రాష్ట్రానికి రోల్ మోడల్‌, పర్యాటక దిక్సూచిగా సిద్ధిపేట కోమటి చెరువు మారనుంది. మినీ ట్యాంక్ బండ్‌గా ఎంతో గొప్ప పర్యాటక శోభను సంతరించుకోనుందని, కోమటి చెరువు పర్యాటక అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరైనట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా కోమటి చెరువును సందర్శించిన విషయం తెలిసిందే. నాడు ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ కోమటి చెరువు అభివృద్ధిపై ‘కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతోంది. కానుక కానుంది’ అని పాట పాడించిన సందర్భం ఆయన ఆలోచన, సీఎం కలను నిజం చేయడానికి కోమటి చెరువును గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

పట్టణ పర్యాటకుల కోసం ముంబయి, హైదరాబాద్ జాతీయ మహనగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ఈ చెరువు పర్యాటక క్షేత్రంగా ముస్తాబు కానుందన్నారు. కోమటి చెరువు అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News