విపత్కర కాలంలోనూ పెద్దపీట
దిశ, ఆందోల్: కరోనా విపత్కర కాలంలోనూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సంగాపూర్‌లో చిల్డ్రన్ పార్క్, డంపింగ్ యార్డ్, శశ్మానవాటికను ప్రారంభించారు. అనంతరం కంకొల్‌లో హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. సంగుపేట గ్రామ శివారులో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ […]
దిశ, ఆందోల్: కరోనా విపత్కర కాలంలోనూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సంగాపూర్‌లో చిల్డ్రన్ పార్క్, డంపింగ్ యార్డ్, శశ్మానవాటికను ప్రారంభించారు. అనంతరం కంకొల్‌లో హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. సంగుపేట గ్రామ శివారులో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.