అంబేద్కర్‌ బాటలోనే సీఎం కేసీఆర్‌ పయనిస్తున్నారు- మంత్రి హరీశ్ రావు

దిశ, గజ్వేల్: మహానీయుడైన అంబేద్కర్‌ బాటలో సీఎం కేసీఆర్‌ పయనిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు దళిత ఎంపవర్మెంట్‌ కింద బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం గజ్వేల్‌ లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహంకు పూల మాలలు వేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, ఎప్టీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి లు నివాళులు అర్పించారు.అనంతరం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. […]

Update: 2021-04-14 04:33 GMT

దిశ, గజ్వేల్: మహానీయుడైన అంబేద్కర్‌ బాటలో సీఎం కేసీఆర్‌ పయనిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు దళిత ఎంపవర్మెంట్‌ కింద బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం గజ్వేల్‌ లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహంకు పూల మాలలు వేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, ఎప్టీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి లు నివాళులు అర్పించారు.అనంతరం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 130వ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను అధికారికంగా సంబరంగా జరుపుకుంటున్నామన్నారు. అందరికీ సమానమైన ఓటు హక్కును కల్పించారని, రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహానీయుడు అంటూ కొనియాడారు.

విభిన్న జాతులు, విభిన్న వర్గాలకు మూడంచెల వ్యవస్థను రూపకల్పన చేశారని, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేశారని అన్నారు. దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాదు ట్యాంక్‌ బండ్‌ పై రూ.130 కోట్ల రూపాయలతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అంబేద్కర్‌ బాటలో ఆయన స్ఫూర్తితో మార్కెట్‌ కమిటీలకు ఎస్సీ, ఎస్టీలకు మహిళలకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. నిరంతరం సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కరేనని హరీష్‌ గుర్తు చేసారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుంది అని అయన అన్నారు.

Tags:    

Similar News