దళితుల కోసం వెయ్యి కోట్లతో దళిత్ ఎంపవర్ మెంట్ పథకం
దిశ, అందోల్: దళిత యువతీ, యువకుల అభ్యున్నతి కోసం త్వరలో రూ.వెయ్యి కోట్లతో దళిత్ ఎంపవర్ మెంట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా రేగోడు మండలం సిందోల్ గ్రామానికి రూ.2.25 కోట్లతో మంజూరైన సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిందోల్ రోడ్డు గత కొన్నేండ్లుగా ఆధ్వాన్నంగా ఉండేదని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిధులు […]
దిశ, అందోల్: దళిత యువతీ, యువకుల అభ్యున్నతి కోసం త్వరలో రూ.వెయ్యి కోట్లతో దళిత్ ఎంపవర్ మెంట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా రేగోడు మండలం సిందోల్ గ్రామానికి రూ.2.25 కోట్లతో మంజూరైన సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిందోల్ రోడ్డు గత కొన్నేండ్లుగా ఆధ్వాన్నంగా ఉండేదని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల లోపు రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పంచాయతీరాజ్ ఎస్ఈ కి మంత్రి ఆదేశించారు. కరోనాతో ఆదాయం తగ్గినా ఏ పథకాన్ని నిలిపివేయలేదని, అభివృద్ది పనులు అగడం లేదన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఈ రోజు వరకు 7 ఎకరాలు కలిగిన 57.60,608 మంది రైతులుండగా, వీరికి పెట్టుబడి సాయంగా రూ.6012.72 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా? ఏ సీఎం మైనా ఉన్నారా? అయన ప్రశ్నించారు. గతంలో ఎరువుల కోసం రోజంతా క్యూలో నిలబడేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామన్నారు.
స్వచ్చ గ్రామాలుగా తీర్చిద్దేందుకు అవసరమైన వాటన్నింటిని అందిస్తున్నామని, డంప్ యార్డులను నిర్మించామని, వైకుంఠధామాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం కులం, మతం ,వర్గాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి
రైతులు ఒకే రకమైన పంటలను సాగుచేయకుండా, పంటలను మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంటల మార్పిడి వలన భూమిలో పోషక విలువలు కూడా పెరుగుతాయన్నారు. వానాకాలంలో జోన్న సాగు కంటే పత్తి, కంది పంటలను సాగు చేయాలన్నారు. కంది, పత్తి పంటలకు మద్దతు ధర వచ్చేలా మేము చూసుకుంటామని ఆయన హమీనిచ్చారు. జోన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే క్రాంతి తమ దృష్టికి తీసుకువచ్చారని, తప్పకుండా ఏర్పాటయ్యేలా చూస్తామన్నారు. జోన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి నష్టం జరిగినా, కొనుగోలు మాత్రం అపేది లేదన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉందని, జోన్నల కొనుగోలు కేంద్రాన్నిఎందుకు ఏర్పాటు చేయడం లేదని, పెట్టుబడి సాయాన్ని ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు.