డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన హరీశ్‌రావు

దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.112 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శనివారం దంతానపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దంతానపల్లిలో దేవాదాయ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పీఎంజీ రోడ్ల నిధుల్లో నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో రూ13 కోట్లు, రెండో విడతలో రూ10 కోట్లు మంజూరు అవుతాయని అన్నారు. మండలంలో డంప్‌యార్లు, స్మశాన వాటికలను […]

Update: 2020-06-27 10:21 GMT

దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.112 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శనివారం దంతానపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దంతానపల్లిలో దేవాదాయ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పీఎంజీ రోడ్ల నిధుల్లో నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో రూ13 కోట్లు, రెండో విడతలో రూ10 కోట్లు మంజూరు అవుతాయని అన్నారు. మండలంలో డంప్‌యార్లు, స్మశాన వాటికలను 15 రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచులను, కార్యదర్శులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధన్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News