అరకొర సాయం కాదు.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని అభిప్రాయపడ్డారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్స్‌లోనూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని అభిప్రాయపడ్డారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్స్‌లోనూ దళితులకు కోట ఇవ్వడం దేశ చరిత్రలో ప్రథమం కావడం తెలంగాణకి గర్వకారణమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ విప్లవం మును ముందుకు సాగుతుందని వెల్లడించారు.
అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా 'తెలంగాణ దళితబంధు' పథకం. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతకు ఇది నిదర్శనం. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుంది. pic.twitter.com/ln4iOSC2s1
— Harish Rao Thanneeru (@trsharish) August 16, 2021